News July 3, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జులై 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి గురువారం, నం.05951 SMVB- NTSK రైలును జులై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News March 17, 2026

కృష్ణా: వారికి నేడే ఆఖరి రోజు!

image

జిల్లాలోని మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు నేడు చివరి రోజు కానుంది. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలనకు ముగింపు పలుకుతూ, రేపటి నుంచి పట్టణ పరిపాలన పూర్తిగా ప్రభుత్వ నియమిత ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల నియామకానికి మార్గదర్శకాలు జారీ చేసి అధికారులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో పరిపాలన కొనసాగింపు బాధ్యతలు అధికారులు చేపట్టనున్నారు.

News March 16, 2026

GDV: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖో-ఖో పోటీలకు రాజ్ కుమార్ ఎంపిక!

image

గుడివాడకి చెందిన క్రీడాకారుడు రాజ్ కుమార్ మరోసారి జాతీయస్థాయిలో మెరవనున్నారు. ఈనెల 19 నుంచి 22 వరకు మహారాష్ట్రలోని పూణే వేదికగా జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖో-ఖో టోర్నమెంట్‌కు ఆయన ఎంపికయ్యారు. AP జట్టు తరఫున రాజ్ కుమార్ ప్రాతినిధ్యం వహించడంపై AP ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ రాజ్ కుమార్ జాతీయ పోటీల్లో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చారని ఆయన కొనియాడారు.

News March 16, 2026

కృష్ణా: పాలక వర్గం లేకపోవడమే.. అక్కడ శాపం

image

చారిత్రక నేపథ్యం ఉన్న యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పాలకవర్గం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ఆధిపత్యం కోసం కమిటీ ఏర్పాటును అడ్డుకుంటున్నారని, దీనిపై ఎమ్మెల్యే కూడా మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆలయంలో రూ. 10 లక్షల మాయంపై కేసు నమోదైనా, పోలీసులకు ఆధారాలు ఇవ్వకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.