News July 3, 2024

నల్గొండ: మండలాలకు ప్రత్యేక అధికారులు కేటాయింపు

image

నల్గొండ జిల్లాలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించిన సంగతి తెలిసిందే. కేతేపల్లి – D. నాగేశ్వరరావు, కొండమల్లేపల్లి – S. ద్వారక, మాడుగుల పల్లి – K. మహేందర్ కుమార్, మర్రిగూడ – D. యల్లయ్య, మిర్యాలగూడ – J. వెంకట్ రెడ్డి, మునుగోడు – K. మురళి, నకిరేకల్ – S. కిరణ్ కుమార్, నల్గొండ – G. గీత లక్ష్మి, నాంపల్లి – K. శ్రీనివాస్, నార్కెట్ పల్లి – V. రమేష్, నేరేడుగోమ్ము -నితిన్ కుమార్ ను కేటాయించారు.

Similar News

News March 14, 2026

NLG జిల్లావ్యాప్తంగా 37 మంది గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. 19,672 మంది విద్యార్థులకు గాను, 19,635 మంది విద్యార్థులు హాజరై 37 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ నాలుగు సెంటర్లను తనిఖీ చేశారని చెప్పారు.

News March 14, 2026

నల్గొండలో 40 డిగ్రీలు దాటిన ఎండలు

image

నల్గొండ జిల్లాలో వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మార్చి రెండో వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.4 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

News March 14, 2026

సామాన్యుడికి చికెన్ ‘షాక్’.. కిలో స్కిన్ లెస్ రూ.330

image

వేసవి ఎండల ప్రభావం, కోళ్ల ఉత్పత్తి తగ్గడం వల్ల జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు రంజాన్ మాసం, ఇటు ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా పెరగడంతో నాన్‌వెజ్ ప్రియులు చికెన్ సెంటర్ల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. NLG మార్కెట్‌లో లైవ్ కోడి KG రూ.192, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.300, స్కిన్ లెస్ కిలో రూ.330లకు విక్రయిస్తున్నారు.