News July 4, 2024

HYD: ఇక నుంచి ఫ్రీ క్యాబ్ క్యాన్సిలేషన్!

image

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓలా, ఉబర్ క్యాబ్ బుక్ చేసుకునే వారికి అధికారులు శుభవార్త చెప్పారు. ఇక నుంచి క్యాబ్ క్యాన్సిలేషన్ ఫీజు ఉండదని స్పష్టం చేశారు. ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం అని వెల్లడించారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. SHARE IT

Similar News

News March 19, 2026

జిల్లాలో ఘనంగా ఉగాది.. ఊరూరా పంచాంగ శ్రవణాలు

image

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగను జిల్లా ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన జిల్లాలోని గ్రామగ్రామాన పంచాంగ శ్రవణాల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగబోయే మంచి చెడులను పూజారులు వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు హాజరయ్యారు.

News March 18, 2026

RR: వారికి డబుల్ బెడ్ రూమ్‌ రద్దు చేయండి: కలెక్టర్

image

లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నివసించకుంటే నోటీస్ ఇచ్చి రద్దు చేయాలని RR కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో హౌసింగ్ బోర్డు అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు.

News March 18, 2026

డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లలో ఉండాల్సిందే.. లేదంటే రద్దే

image

రంగారెడ్డి జిల్లాలో కేటాయించిన డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు ఈనెల 31లోపు నివాసం ఉండాలని, లేనిపక్షంలో కేటాయింపులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను ఏప్రిల్ మొదటి వారంలో కొత్తవారికి కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని RDO, MROలను కలెక్టర్ ఆదేశించారు.