News July 4, 2024

సింహగిరి ప్రదక్షణ అధికారులతో సమీక్షించిన కమిషనర్

image

ఈ నెల 20,21 వ తేదీలలో జరుగనున్న శ్రీ సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత ఈ రోజు నగర పోలీసు కమీషనర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ముందస్తు రివ్యూ సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన పలు గిరి ప్రదక్షిణ బందోబస్తు ఏర్పాట్లను వీడియోల ద్వారా పరిశీలించారు. దారి పొడవునా వీధి దీపాలు ఏర్పాటు, సముద్ర స్నానాల్లో భద్రత చర్యలు తదితర అంశాలపై చర్చించారు.

Similar News

News March 3, 2026

విశాఖ: బీచ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

image

ఆర్కే‌బీచ్‌లోని సుప్రీం హోటల్ ఎదురుగా అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు జగదాంబ సమీపంలో నివాసం ఉండే ఎం.శ్రీధర్ (36)గా పోలీసులు గుర్తించారు. శ్రీధర్ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

News March 3, 2026

విశాఖ: బర్త్‌డే.. డెత్‌ డే

image

ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు <<19282896>>మృతి చెందిన<<>> విషయం తెలిసిందే. మృతుడు విజయనగరం (D) గజపతినగరం (M) రామన్నపేటకు చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. సాయికిరణ్ ఉషోదయ జంక్షన్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం తన పుట్టినరోజు కావడంతో బైక్‌పై సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై ధర్మేందర్ తెలిపారు.

News March 3, 2026

విశాఖ: కోస్టల్ కారిడార్‌పై మల్లగుల్లాలు..

image

భోగాపురం విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు VMRDA ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష జరిగింది. ఎయిర్‌పోర్ట్ అనుసంధాన మార్గాలు, విశాఖ పోర్టు నుంచి విమానాశ్రయం వరకు కొస్టల్ కారిడార్ ప్రతిపాదనపై MPలు, MLAలు, విశాఖ, విజయనగరం కలెక్టర్లు చర్చించారు. అమలుపై ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు, సూచనలు చేశారు. భూసేకరణ, మార్గ రూపకల్పన అంశాల్లో స్పష్టత అవసరమని అభిప్రాయపడినట్టు తెలిసింది.