News July 4, 2024

మెదక్: జిల్లా కలెక్టరేట్లో ఈ ఆఫీస్ ప్రారంభం

image

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ ఆఫీస్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు డిజిటల్ సంతకంతో ప్రతి ఫైలు ఈ ఆఫీసు ద్వారా తనకు పంపించాలని అన్నారు. ఇక నుంచి ప్రతి ఫైలు మాన్యువల్‌గా స్వీకరించడం జరగదని ఈ ఆఫీస్ ద్వారా రావాలని అన్నారు. ఆయా శాఖల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఆయా శాఖల అధికారులు, పాల్గొన్నారు.

Similar News

News March 5, 2026

మెదక్: చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని సూసైడ్

image

మనోహరాబాద్ :చిట్టీ డబ్బుల విషయంలో మనస్థాపానికి గురై శివంపేట్ మండలం గంగాయిపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరబాద్ మండలం పోతారంలో ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షల చిట్టీ వేయగా, గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన కుటుంబీకులు, గ్రామస్థులు ఆ వ్యక్తి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు

News March 5, 2026

MDK: 99 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్

image

మెదక్ ఐడిఓసిలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాల అమలు, సమన్వయం, ప్రజలకు సేవలు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

News March 5, 2026

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, బిల్లులు, సామగ్రి సరఫరా, సాంకేతిక పర్యవేక్షణపై అధికారులకు సూచనలు చేశారు.