News July 4, 2024

డంక్డ్ రైస్ కేక్.. అంటే ఇడ్లీ: హర్ష గొయొంక పోస్ట్ వైరల్

image

విదేశాల్లోని రెస్టారెంట్లలో భారతీయ వంటకాల పేర్ల చూసి పారిశ్రామికవేత్త హర్ష గొయొంక అవాక్కయ్యారు. ఆయన వెళ్లిన హోటల్‌‌లో సాంబార్ వడ పేరును ‘డంక్డ్ డోనట్’, ఇడ్లీని ‘డంక్డ్ రైస్ కేక్’, దోశను ‘నేకెడ్ క్రీప్‌’గా మార్చేశారు. ‘వడ, ఇడ్లీ, దోశలు ఇంత ఫ్యాన్సీగా మారుతాయని ఎవరికి తెలుసు’ అని ఆయన ఫన్నీ ట్వీట్ చేశారు. కాగా ప్లేట్ సాంబార్ వడ ధర రూ.1300, ఇడ్లీ రూ.1200 ఉండటం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

Similar News

News March 14, 2026

గ్యాస్ బుక్ అయినా నో డెలివరీ! మీకూ ఈ సమస్య ఉందా?

image

వంటగ్యాస్ ఇబ్బందులు తప్పట్లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYDలో గ్యాస్ బుక్ అయినా OTP రావట్లేదని, సిలిండర్ డెలివరీ కావట్లేదని వాపోతున్నారు. 4-5 రోజులుగా ఎదురుచూస్తున్నా స్పందన లేదంటున్నారు. కాగా కొందరు ఏజెన్సీలకు వెళ్లి సిలిండర్ తెచ్చుకుంటున్నారు. మరి గ్యాస్ బుకింగ్, డెలివరీలో మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో కామెంట్ చేయండి.

News March 14, 2026

కోడి పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

ఎండలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కోడి పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి వేడి ఒత్తిడికి గురైతే నీరసంగా మారతాయి. విరేచనాలు అయ్యి నిలబడలేక వణుకుతుంటాయి. అలాగే అవి మెడలు వాల్చి సన్నగా మూలుగుతూ ఉన్నా, వాటి కంటి నుంచి నీరు కారుతున్నట్లు గుర్తించినా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలున్న కోడి పిల్లలను, కోళ్లను షెడ్డులోని మిగిలిన వాటి నుంచి వేరు చేసి వెటర్నరీ నిపుణులకు చూపించాలి.

News March 14, 2026

‘సంభల్’లో నమాజ్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

image

<<15204583>>వివాదాస్పద సంభల్‌‌<<>>లోని మసీదులో నమాజ్ చేసే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలన్న UP అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. శాంతిభద్రతలను పరిరక్షించలేకపోతే SP, కలెక్టర్ బదిలీ చేయించుకోవాలని, లేదంటే రిజైన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి కమ్యూనిటీకి కేటాయించిన స్థలంలో శాంతియుతంగా ప్రార్థనలు చేసుకునేలా చేయడం ప్రభుత్వ విధి అని తెలిపింది.