News July 4, 2024
నరసన్నపేట: ‘104 సిబ్బంది సమస్యలను పరిష్కరించండి’

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 104 వైద్య సేవలలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రమణమూర్తికి వినతి పత్రం సమర్పించారు. బుధవారం జిల్లాలోని 104 సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తాము వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తూనే ఉన్నామని, కాని తమ సమస్యలు పరిష్కారం అవ్వడంలేదని ఆయనకు విన్నవించుకున్నారు.
Similar News
News March 20, 2026
మందస: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మందస మండలంలోని కొర్రాయి గేటు వద్ద తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..సోంపేట నుంచి కాశీబుగ్గ వైపునకు వస్తున్న యువకుడు బైక్ అదుపు తప్పి పక్కన రక్షణ ఇనుమును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మందస ఎస్సై కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి హరిపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
News March 20, 2026
‘అర్జీలను సత్వరం పరిష్కరించాలి’: శ్రీకాకుళం కలెక్టర్

దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌ను కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమశాఖ, ఏడీబీ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌లో 7 దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News March 20, 2026
శ్రీకాకుళం జిల్లాలో యువకుడి హత్య.!

శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తి గత రాత్రి హత్యకు గురయ్యారు. హత్య చేసిన వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలో మోహన్ తండ్రి ఇదే పార్టీ కార్యాలయంలో పనిచేసేవారు. అతని స్థానంలో మోహన్‌ను ఇటీవల నియమించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


