News July 4, 2024

ప్రజావేదిక కార్యక్రమం వాయిదా

image

AP: సీఎం చంద్రబాబు నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమం ఈవారం వాయిదా పడింది. అనివార్య కారణాలతో ప్రజావేదికను రద్దు చేసినట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు గమనించాలని కోరారు. వినతులు స్వీకరించేందుకు ప్రతి శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Similar News

News March 4, 2026

యుద్ధం.. 1,097 మంది ఇరానియన్లు మృతి

image

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 1,097 మంది పౌరులు చనిపోయినట్లు USకు చెందిన హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. వీరిలో 10 ఏళ్లలోపు పిల్లలు 181 మంది ఉన్నట్లు తెలిపింది. లెక్కలోకి రాని మృతులు, గాయపడిన వారి సంఖ్య కూడా వందల్లో ఉంటుందని పేర్కొంది. కాగా ఇరాన్‌లోని కీలక స్థావరాలపై US అటాక్ చేస్తుండగా, ఇజ్రాయెల్‌తోపాటు ఇరాక్, కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల దాడి కొనసాగిస్తోంది.

News March 4, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>RITES<<>> లిమిటెడ్‌ 5 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్, CA/ICWA/CFA/MBA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. మార్చి 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News March 4, 2026

చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే: ఇరాన్

image

చర్చలపై US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<19290770>>వ్యాఖ్యలపై<<>> ఇరాన్ స్పందించింది. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ స్పష్టం చేశారు. సుదీర్ఘ యుద్ధానికి తమను తాము సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 2 దేశాల మధ్య డిస్కషన్స్ జరుగుతుండగానే ద్వేషంతో ట్రంప్ దాడులు చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మండిపడ్డారు. అణు చర్చలను రియల్ ఎస్టేట్ లావాదేవీల్లా మార్చారని ఫైరయ్యారు.