News July 4, 2024
చౌటుప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం ఇలా..

చౌటుప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి NHAI రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. జాతీయ రహదారిపై 2.45 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లేదారి నుంచి వలిగొండ చౌరస్తా వరకు మట్టితో వంతెనను నిర్మిస్తారు. మధ్యలో ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు 200 మీటర్ల పొడవు మట్టి కట్ట కాకుండా సిమెంట్ పిల్లర్లతో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News September 15, 2025
NLG: సిరులు కురిపించనున్న తెల్ల బంగారం..!

పత్తి సాగు నల్గొండ జిల్లా రైతులకు సిరులు కురిపించనుంది. జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అంచనాలకు మించి రైతులు పత్తి పెద్ద ఎత్తున సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,47,735 ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా అంచనాకు మించి 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జిల్లాలో మొదటి దశ పత్తితీత పనులను ఇటీవల రైతులు ప్రారంభించారు. 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా.
News September 15, 2025
మూసీకి తగ్గిన వరద

మూసీ నదికి వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 4,385.47 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను 4.12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అధికారులు 3 క్రస్ట్ గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.
News September 15, 2025
NLG: పాస్ ఉంటేనే అనుమతి

ఇవాళ నిర్వహించే MGU స్నాతకోత్సవానికి యూనివర్శిటీలోకి విద్యార్థితో పాటు వారి వెంట కుటుంబ సభ్యుల్లో ఒకరిని లోపలికి అనుమతించనున్నారు. వేదికపై వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే అతిథులు ఆసీనులు కావాల్సి ఉంటుంది. యూనివర్శిటీలోకి వెళ్లాలంటే వారికి ఇచ్చిన అనుమతి పత్రం (పాస్) తప్పనిసరిగా ఉండాలి. పాస్ లేకుంటే యూనివర్సిటీ లోపలికి భద్రతా సిబ్బంది అనుమతించరు.