News July 4, 2024
కామారెడ్డి: ప్రేమ పేరుతో మోసం.. పోక్సో కేసు నమోదు

యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన లింగంపేట్‌లో చోటు చేసుకుంది. పరిమళ గ్రామానికి చెందిన ఓ బాలికకు మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన భాస్కర్(24)తో ఇన్‌స్టాలో పరిచయమైంది. దీంతో అమ్మాయికి మాయ మాటలు చెప్పి ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు తెలిపారు.
Similar News
News March 3, 2026
NZB: CM రేవంత్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు అందించారు.
News March 3, 2026
భారతీయుల కోసం 24/7 హెల్ప్ లైన్ సేవలు!

యూఏఈలో నివసిస్తున్న భారతీయుల కోసం ఇండియన్ పీపుల్స్ ఫోరం (IPF) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ, న్యాయ సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో కన్వీనర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ఈ సేవలను ప్రశంసిస్తూ, యూఏఈలోని భారతీయులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరితగతిన సాయం అందించడమే ఈ ఫోరం లక్ష్యమని పేర్కొన్నారు.
News March 3, 2026
NZB: రూ.3.90 లక్షల జరిమానా

నిజామాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ సోమవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 39 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.3.90 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.


