News July 4, 2024

కొత్తగూడెం: టీమిండియాలో చోటే లక్ష్యం

image

దమ్మపేట మం. సుధాపల్లికి చెందిన రామకృష్ణ, సునీత దంపతుల కుమార్తె తుష్మరేఖ క్రికెట్‌లో రాణిస్తున్నారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా తల్లి సహకారంతో అదరగొడుతున్నారు. 13ఏళ్ల వయసులో వనపర్తి స్పోర్ట్స్ అకాడమీలో చోటు సంపాదించారు. ప్రస్తుతం అండర్-19 క్రీడాకారిణిగా ఉన్న రేఖ ధోనిని స్ఫూర్తిగా తీసుకుని టీమిండియాలో చోటు సంపాదిస్తానని చెబుతున్నారు. బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న రేఖ చదువులోనూ రాణిస్తున్నారు.

Similar News

News October 7, 2024

కొత్తగూడెం: ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కొత్తగూడెం రుద్రంపూర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆరు కొత్త కోర్సులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆగస్టు 1 నాటికి 14 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.

News October 7, 2024

ఖమ్మం: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు: ట్రాఫిక్ ఏసీపీ

image

ఖమ్మంలో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ACP శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వాహన తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్ లేని 55 బైకులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడిన వాహన పత్రాలు, ఛాసిస్ నంబర్లు తనిఖీ చేస్తూ చోరికి గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలిస్తునట్లు పేర్కొన్నారు.

News October 7, 2024

రేపు ఖమ్మం నగరంలో డిప్యూటీ సీఎం పర్యటన

image

ఖమ్మం నగరంలో మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టరేట్‌లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎంపీడీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. తదనంతరం డిప్యూటీ సీఎం బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.