News July 4, 2024

RRR.. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాల సేకరణ

image

ఉమ్మడి జిల్లాలో RRR నిర్మాణానికి 80 శాతం సర్వే పూర్తి కావడంతో అధికారులు భూ సేకరణకు కసరత్తు చేస్తున్నారు. RRR ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 110KM ఉండటంతో 4,500 ఎకరాల భూమిని సేకరిస్తారు. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలు, అందోల్‌-జోగిపేట, గజ్వేల్, తూప్రాన్, సంగారెడ్డి పరిధిలో మొత్తంగా 54 గ్రామాల్లో భూమి తీసుకుంటారు. అటు ప్రభుత్వ నిర్ణయంపైనే మా భవిష్యత్ ఆధారపడి ఉంటుందని భూ నిర్వాసితులు అంటున్నారు.

Similar News

News January 8, 2026

మెదక్: ఈనెల 10 నుంచి డ్రాయింగ్ గ్రేడ్ పరీక్షలు

image

డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలు ఈనెల 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు డిఈఓ విజయ తెలిపారు. మెదక్ బాలికల పాఠశాల కేంద్రంగా ఉ. 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమతో పాటు పెన్సిళ్లు, రంగులు, రైటింగ్ ప్యాడ్లు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరికరాలను తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News January 8, 2026

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్‌

image

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం అక్కన్నపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన కలెక్టర్, బోర్డు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన అందించాలన్నారు.

News January 8, 2026

మెదక్: తీవ్ర విషాదం.. బురదలో రైతు మృతి

image

కౌడిపల్లి మండలంలో మర్రి చెట్టు తండాలో పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు బురదలో పడి గిరిజన రైతు మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మర్రి చెట్టు తండా చెందిన కాట్రోత్ దినాకర్(28) తన పొలంలో వరి నాటు కోసం పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు జారి బురదలో పడిపోయాడు. స్థానిక రైతులు చూసి దినాకర్‌ను లేపి చూడగా, అప్పటికే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.