News July 4, 2024

నేడు మాజీ CM జగన్ నెల్లూరు పర్యటన వివరాలు.!

image

మాజీ సీఎం జగన్ నేడు నెల్లూరుకు వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ.11.15 గంటలకు కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనుపర్తిపాడుకు చేరుకొని హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి బయలుదేరుతారు.

Similar News

News March 3, 2026

మంగళగిరిలో హనుమాన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

image

వన్యప్రాణి సంహారాన్ని నివారించి, కో-లివింగ్ వైపు మలచడమే హనుమాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం మంగళగిరి 6వ బెటాలియన్‌లో ఈ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. వన్యప్రాణుల వల్ల పంట, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన పవన్.. అటవీ శాఖ చరిత్రలో ఇది కీలక రోజని అభివర్ణించారు.

News March 3, 2026

అమెరికా స్వార్థంతోనే యుద్దాలు: CPI నారాయణ

image

అమెరికా స్వార్థంతోనే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం జరుగుతోందని CPIజాతీయ నాయకులు కె.నారాయణ తెలిపారు. 3వ ప్రపంచ యుద్ధంగా ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోందని చెప్పారు. ఎవరు ఆరంభించారో వారే యుద్దానికి ముగింపు పలకాలని హితవు పలికారు. కొత్తపేట CPI కార్యాలయంలో మంగళవారం నారాయణ మాట్లాడారు. యుద్దాల ప్రభావంతో ఆయిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలుఇబ్బంది పడతారన్నారు