News July 4, 2024

నేడు పిన్నెల్లితో జగన్ ములాఖత్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ నెల్లూరు వెళ్లనున్నారు. సెంట్రల్‌ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆయన ములాఖత్ అవుతారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్‌, కారంపూడి సీఐపై దాడి కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 17, 2026

బొప్పాయిలో గొంగళి పురుగు నివారణ ఎలా?

image

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.

News March 17, 2026

హనుమాన్ చాలీసా ఎందుకు పఠించాలి?

image

పూర్వం తులసీదాసు జైలులో బంధీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా రచంచి, పఠించారు. అప్పుడు వేల వానరాలు రాజభవనంపై దాడి చేశాయి. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి అది దైవ సంకల్పమని గ్రహించి, తులసీదాసును విడుదల చేసి క్షమాపణ కోరాడు. కోతులు కూడా శాంతించి అక్కడి నుంచి వెళ్లాయి. తులసీదాసు భక్తి ఆయనను ప్రాణాపాయం నుంచి కాపాడింది. అందుకే మన ఆపదలు తొలగి, ధైర్యం కలగాలంటే రోజూ హనుమాన్ చాలీసా పఠించాలని పండితులు సూచిస్తారు.

News March 17, 2026

యుద్ధం.. లెబనాన్‌లో 886 మంది మృతి

image

ఇజ్రాయెల్ చేస్తున్న భీకర వైమానిక దాడుల్లో ఇప్పటిదాకా 886 మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 111 మంది చిన్నారులు, 67 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్, US దాడుల్లో ఇరాన్‌లో 1500 మందికి పైగా చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.