News July 4, 2024

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల్లోని ఉపాధ్యాయులు
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రవీందర్ కోరారు. http:///nationalawardstoteachers.education.gov.in వెబ్సైట్ లో వివరాలను నిర్ణీత నమూనాలో నిక్షిప్తం చేయాలని సూచించారు.

Similar News

News March 27, 2026

MBNR: అంబేద్కర్ వర్సిటీ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం 2025 – 26 పరీక్షల షెడ్యూల్ విడుదల అయినట్లు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా కె పద్మావతి పేర్కొన్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మేలో ఉంటాయని టైం టేబుల్ వెబ్ సైట్‌లో ఉందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆకాశం ఉందని రీజినల్ కోఆర్డినేటర్ డా జి సత్యనారాయణ గౌడ్ వెల్లడించారు.

News March 26, 2026

MBNR: హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలుశిక్ష

image

భూవివాదం నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు గౌరవనీయ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2023 జనవరి 31న చన్నారెడ్డిపల్లి గ్రామ పరిధిలో బాధితుడు యెరుకలి చెన్నయ్యపై నిందితులు యెరుకలి వెంకటయ్య A1, శ్రీను A2, మల్లేష్ A3 కలిసి ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. పోలీసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన నవాబ్‌పేట్ పోలీసుల పనితీరును ఆయన కొనియాడారు.

News March 26, 2026

MBNR: పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారంపై దృష్టి: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం జిల్లాలోని అన్ని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, ఎన్‌బీడబ్ల్యూ (NBW), ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ కేసులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.