News July 4, 2024
కర్నూలు: నేడు విద్యాసంస్థల బంద్.. పోలీసుల అప్రమత్తం

విద్యార్థి సంఘాలు నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీస్ పోలీసు శాఖ అప్రమత్తమైంది. కేంద్రం నిర్వహించే పలు పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, ఇతరత్రా డిమాండ్లతో SFI, AISF, PDSEU, AISA, NSUI, PDSU సంఘాలు ఉమ్మడిగా బంద్ చేపట్టనున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News March 12, 2026
ఉత్తమ సేవా పతకాలకు 27 మంది పోలీసుల ఎంపిక

కర్నూలు జిల్లా పోలీసు శాఖలో విశిష్ఠ సేవలు అందించిన 27 మంది అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికి గాను ఉత్కృష్ట సేవా పతకం, అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌తో పాటు వివిధ సేవల్లో ప్రతిభ చూపినందుకు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వీరికి పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
News March 12, 2026
కర్నూలు జిల్లాలో 1.75 లక్షల హెక్టార్లలో రబీ పంటల సాగు

కర్నూలు జిల్లాలో 2025-26 రబీ సీజన్ పంటల నమోదు ప్రక్రియ పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి గురువారం తెలిపారు. రైతు సేవా కేంద్రాల వారీగా వివరాలు అందుబాటులో ఉంచమని రైతులు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా రైతు సేవా కేంద్రాల్లో తెలియజేయాలన్నారు. అభ్యంతరాలకు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయవచ్చని సూచించారు.
News March 12, 2026
కర్నూలులో 261 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 4,590 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 4329 మంది మాత్రమే పరీక్ష రాశారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.


