News July 4, 2024
HYD: గురుకులాల్లో కామన్ టైమ్ టేబుల్: సీఎస్

రాష్ట్రంలోని ఐదు గురుకుల విద్యా సంస్థల్లో కామన్ టైమ్ టేబుల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఒక్కో సొసైటీలో ఒక్కో విధంగా బోధన కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలో అయితే డేస్కాలర్ స్కూల్ తరహాలో టైమ్ టేబుల్ అమలు చేస్తున్నారు. అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే విధానం అమలు చేయాలని సీఎస్ శాంతికుమారి బుధవారం HYDలో ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News July 4, 2025
HYD: వేగంగా.. మెగా మాస్టర్ ప్లాన్-2050

HYD మెగా మాస్టర్ ప్లాన్-2050 వేగం పుంజుకుంటుందని HMDA అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిపాదించిన కామన్ మొబిలిటీ, ఎకనామికల్ డెవలప్మెంట్ బ్లూ, గ్రీన్ ఏరియా ప్లాన్ తుది దశకు చేరుకున్నాయి. మరోవైపు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేసేందుకు కన్సల్టెన్సీ ప్రపోజల్ రిక్వెస్ట్ కోసం HMDA ప్రకటన విడుదల చేసింది. ఈనెల 18వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ప్లాన్ అమలైతే HYD మరో స్థాయికి వెళ్లనుంది.
News July 4, 2025
బంజారాహిల్స్‌లోని వరుణ్ మోటార్స్ సీజ్

బంజారాహిల్స్ రోడ్ నం.2లోని వరుణ్ మోటార్స్‌ను GHMC అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వరుణ్ మోటార్స్ నిర్వహకులు వ్యాపారం చేస్తుండడంతో పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఇవాళ సీజ్ చేశారు. గత మూడేళ్లుగా అడ్వర్‌టైజ్మెంట్ ఫీజులు బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
News May 8, 2025
ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.