News July 4, 2024
విలీన మండలాల సాధన కోసం దీక్ష చేయండి: డిప్యూటీ భట్టి

బీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఏడు మండలాల సాధన కోసం దీక్ష చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాలు విసిరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఆ మండలాలను విలీనం చేసిందని విమర్శించారు. పార్లమెంటులో బీజీపీ – బీఆర్ఎస్ ఒప్పంద మేరకే మండలాల విలీనం జరిగిందని చెప్పారు.
Similar News
News November 6, 2025
ఖమ్మం: స్కూటీ రిపేర్ చేయలేదని షో రూమ్‌కు తాళం

ఖమ్మంలో గురువారం వినూత్న ఘటన జరిగింది. తన ఎలక్ట్రికల్ స్కూటీని రిపేర్ చేయలేదన్న కారణంగా ఓ వ్యక్తి ఏకంగా షోరూమ్‌కు తాళం వేశాడు. బోనకల్ మండలం రావినూతలకి చెందిన కొమ్మినేని సాయి కృష్ణ నాలుగు నెలల క్రితం స్కూటీ కొనుగోలు చేశారు. రిపేరు రావడంతో షోరూమ్ సిబ్బందిని సంప్రదించగా, అది తమ పరిధిలో రిపేరు కాదని వారు తెలిపారు. దీంతో అసహనానికి గురైన సాయి కృష్ణ ఆ షోరూమ్‌కు తాళం వేసినట్లు సమాచారం.
News November 6, 2025
వెట్‌ల్యాండ్‌లలో నిర్మాణాలు నిషేధం: అదనపు కలెక్టర్

వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వెట్‌ల్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 467 వెట్ ల్యాండ్‌లు 8,911 హెక్టార్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం నిషేధమని ఆయన తెలిపారు. భూ యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులు గమనించాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
News November 6, 2025
టేకులపల్లి ఐటీఐలో నవంబర్ 7న జాబ్ మేళా

భారత్ హ్యుండాయ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 24 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. డిగ్రీ అర్హతతో సేల్స్ కన్సల్టెంట్స్ (రూ.18,000), డీజిల్ మెకానిక్ లేదా బిటెక్ అర్హతతో సర్వీస్ అడ్వయిజరీ (రూ.12,000) పోస్టులు ఉన్నాయని చెప్పారు.


