News July 4, 2024
పల్నాడు జిల్లాలో క్షుద్రపూజల కలకలం

నరసరావుపేట మండలంలోని చిన్నతురకపాలెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చెట్లకు ఇనుప మేకులు కొట్టి, రోడ్డు కూడలిలో నిమ్మకాయలు వేసి, పసుపు, కుంకుమ పెట్టి వెళ్తున్నారు. దాంతో ఇనుప మేకులు కొట్టిన చెట్లను గ్రామస్థులు నరికివేస్తున్నారు. కొత్త వ్యక్తులు గ్రామంలోకి రాకుండా రాత్రులు కాపలా కాస్తున్నారు. అయితే క్షుద్రపూజల భయంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News March 11, 2026
వైసీపీ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధం

వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పార్టీ అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారని నాయకులు చెబుతున్నారు.
News March 11, 2026
పెదకాకాని మర్డర్ కేసు ఛేదించిన GRP పోలీసులు

పెదకాకాని రైల్వే స్టేషన్‌లో మార్చి 4న జరిగిన హత్య కేసును గుంటూరు GRP పోలీసులు, RPF సిబ్బంది ఛేదించారు. మృతుడు పరమడం అనీశ్ బ్లేడ్‌గా గుర్తించారు. దొంగతనాల వాటా విషయంలో జరిగిన వివాదంతో అతని సహచరులే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఎఫ్. కుమార్ ఎంతోని కుమార్, దీపేశ్ MS మెంటల్, కొప్పుల వెంకటేశ్ వెంగీలను మార్చి 9న గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
News March 11, 2026
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం

గుంటూరు జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గత నెలలో ఉమ్మడి జిల్లాలో 17.5 మిలియన్ యూనిట్లు వినియోగించగా ప్రస్తుతం 20.1 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గుంటూరు సర్కిల్ పరిధిలో గత నెలలో 7.3 మిలియన్ యూనిట్లు ఉండగా ఇప్పుడు 8.5 మిలియన్ యూనిట్లకు డిమాండ్ చేరింది. వేసవి వేడి కారణంగా ఎసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరగడం దీనికి కారణమని అధికారులు తెలిపారు. విద్యుత్‌ను పొదుపుగా వాడాలన్నారు.


