News July 4, 2024

టన్ను ఇసుక రూ.88

image

AP: <<13558406>>ఉచిత<<>> ఇసుక విధానంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. గతంలో టన్ను ₹475 చొప్పున విక్రయించారు. కాంట్రాక్టర్, రవాణా ఖర్చు ₹100 తీసేయగా మిగిలిన ₹375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై ఆ మొత్తం కాకుండా రూ.88 వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఆ డబ్బునూ స్థానిక సంస్థలకే కేటాయిస్తారు. ₹88తోపాటు స్టాక్ పాయింట్‌లో లోడింగ్ ఖర్చు, రవాణా వ్యయాన్ని(దాదాపు ₹100) కలెక్టర్లు ఖరారు చేస్తారు.

Similar News

News January 16, 2025

ఇజ్రాయెల్-గాజా సీజ్‌ఫైర్: 6 వారాల తర్వాత ఏం జరుగుతుందంటే?

image

ఇజ్రాయెల్-గాజా సీజ్‌ఫైర్ 3 దశల్లో కొనసాగుతుందని హమాస్ విడుదల చేసిన డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. మొదటి దశ 6 వారాలు ఉంటుంది. వారానికి కొందరు చొప్పున చివరి వారం బందీలందరినీ హమాస్ విడుదల చేస్తుంది. రెండో వారం మిలిటరీ ఆపరేషన్స్ శాశ్వతంగా ఆగిపోతాయి. ఇజ్రాయెల్, గాజా పరస్పరం పౌరులు, సైనికుల్ని విడుదల చేస్తాయి. మూడో దశలో మృతదేహాలు, అస్థికలను ఇస్తారు. ఆ తర్వాత 3-5 ఏళ్లలో గాజా పునర్నిర్మాణం మొదలవ్వాలి.

News January 16, 2025

సైఫ్‌పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్టీఆర్

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన <<15167744>>దాడిపై<<>> యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనిపై ‘దేవర’ టీమ్ సైతం స్పందిస్తూ.. ‘ఇది తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాం. త్వరగా కోలుకోండి సైఫ్ సార్’ అని పేర్కొంది.

News January 16, 2025

Stock Markets: బెంచ్‌మార్క్ సూచీల దూకుడు

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, హిండెన్‌బర్గ్ షట్‌డౌన్ అంశాలు పాజిటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. నిఫ్టీ 23,350 (+136), సెన్సెక్స్ 77,174 (+444) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, రియాల్టి సూచీలు కళకళలాడుతున్నాయి. అదానీ షేర్లు పుంజుకున్నాయి. HDFCLIFE, ADANISEZ, SBILIFE, ADANIENT, SRIRAMFIN టాప్ గెయినర్స్.