News July 4, 2024
కర్నూలు: నేటి నుంచి ‘స్కౌట్స్ అండ్ గైడ్స్’ దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు జిల్లాలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాత యూనిట్ల పునరుద్ధరణ, కొత్త యూనిట్ల నమోదుకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శామ్యూల్ తెలిపారు. 8వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు రిజస్ట్రేషన్ క్లడ్/బుల్బులకు రూ.211, స్కాట్స్ అండ్ గైడ్స్‌కు రూ.381, రివర్స్ అండ్ రేంజర్స్‌కు రూ.301 ప్రకారం ఫీజు చెల్లించి ప్రతి స్కూల్ యాజమాన్యం రసీదు పొందాలన్నారు.
Similar News
News March 16, 2026
కర్నూలు: పోలీస్ పరిష్కార వేదికకు 102 వినతులు

వినతులు అందించిన వారికి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ పీజీఎస్ఆర్‌లో మొత్తం 102 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగ మోసం, భూ వివాదాలు, ప్లాట్ రిజిస్ట్రేషన్ సమస్యలు, ఫైనాన్స్ తదితర అంశాలపై ప్రజలు వినతులు అందించారు. ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
News March 16, 2026
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిరి

కర్నూలు ఏ క్యాంప్‌లోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సోమవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతులపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామని ఏపీసీ లోకరాజు తెలిపారు. నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.
News March 16, 2026
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: DEO

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆదేశించారు. సోమవారం డీఈవో కార్యాలయం నుంచి నిర్వహించిన కమాండ్ కంట్రోల్ సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏవైనా అసౌకర్యాలు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరీక్షల విభాగపు అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ పాల్గొన్నారు.


