News July 4, 2024
తిరుపతి: JRFకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డీఆర్డీవో ఆర్థిక సహకారంతో నడుస్తున్న రీసెర్చ్ ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పీజీలో మైక్రోబయాలజీ /బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/వైరాలజీ కోర్సు పూర్తిచేసి నెట్/సీఎస్ఐఆర్/డీబీటీ/ గేట్ పరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు ఈనెల 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 8, 2026
చిత్తూరు: పెరుగుతున్న చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.179 నుంచి రూ.186, మాంసం రూ.260 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.295 నుంచి రూ.320వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 72 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 8, 2026
చిత్తూరులో భానుడి ప్రతాపం

సాధారణంగా వేసవి ప్రభావంతో ఏప్రిల్ నాటికి ఎండలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రానున్న మూడు రోజులపాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
News March 7, 2026
మృత్యుంజయ స్వామిని దర్శించుకున్న జడ్జి అరుణ

చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక శనివారం చౌడేపల్లి మండలంలోని పలు దేవాలయాలను సందర్శించారు. తొలుత స్థానిక శివాలయంలో మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. శివాలయంలో అర్చకులు, బోయకొండలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం న్యాయమూర్తిని సాదరంగా ఆహ్వానించి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు.


