News July 4, 2024

సికింద్రాబాద్: B.Tech పూర్తి చేసిన ఆర్మీ అధికారులు

image

సికింద్రాబాద్ MCEME వద్ద జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాన్వకేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా TES-41, B.Tech కోర్సు పూర్తి చేసిన ఆర్మీ అధికారులకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో శ్రీలంక, భూటాన్ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అధికారులు సైతం ఉన్నట్లు డాక్టర్ రమేశ్ కంచర్ల తెలియజేశారు. ఉద్యోగంలోనే ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని అధికారులన్నారు.

Similar News

News December 30, 2024

ఖైరతాబాద్: మాజీ ఎంపీని పరామర్శించిన మంత్రులు

image

నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్‌లు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని డాక్టర్ల బృందానికి మంత్రులు సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

News December 30, 2024

HYD: కనుమరుగవుతున్న చెరువులు..!

image

రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, HYD జిల్లాల పరిధిలో దాదాపుగా 24 చెరువులు పూర్తిగా కబ్జాకు గురై కనుమరుగైనట్లు TGRAC తెలిపింది. 2014కు ముందు ఈ ఆక్రమణలు జరిగినట్లుగా పేర్కొంది. రాష్ట్రం ఏర్పడ్డాక మేడ్చల్ జిల్లాలో 28, రంగారెడ్డి జిల్లాలో 22, సంగారెడ్డి జిల్లాలో 7 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురయ్యాయని వెల్లడించింది.

News December 30, 2024

HYD: రాష్ట్రంలోనే అతిపెద్ద పూల మార్కెట్.. ఇదీ పరిస్థితి..!

image

రాష్ట్రంలోనే అతిపెద్ద పూల మార్కెట్‌గా పేరొందిన గుడిమల్కాపూర్‌లో వ్యాపారులకు స్థలం సరిపోటం లేదని ఆవేవదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారులూ ఇక్కడ అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌కు సుమారు రూ.2.79 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ, వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదని వ్యాపారస్థులు చెబుతున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి, మార్కెట్‌ను విస్తరించాలని కోరుతున్నారు.