News July 4, 2024
కొత్త చట్టాలపై ప్రతి పోలీస్ స్టేషన్‌లో అవగాహన: ఎస్పీ గైక్వాడ్

జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని స్థాయిల్లోని పోలీసులకు కొత్త చట్టాల అమలుపై శిక్షణా తరగతులు నిర్వహించామని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఇక నుంచి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిఒక్కరూ నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రజలు తమ అనుమానాల నివృత్తి కోసం పోలీస్ శాఖను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Similar News
News March 3, 2026
జడ్చర్ల: కుక్కలు పీక్కుతిన్న మృతదేహం ఇతడిదే!

జడ్చర్ల మండలం నాగసాల చెరువులో పడి మృతి చెందిన భీమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం గది బయట కుక్కలు పీక్కుతిన్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై నూతన ప్రభుత్వాసుపత్రిలోని పోస్టుమార్టం గదిలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.
News March 3, 2026
జడ్చర్ల: బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: అనిరుధ్ రెడ్డి

జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న విషయం తెలుసుకున్న MLA అనిరుధ్ రెడ్డి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో మాట్లాడుతామన్నారు. ఘటనకు బాధ్యులైన సిబ్బంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు తెలిపారు.
News March 2, 2026
MBNR: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లాలో హోలీ పండుగను సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, బలవంతంగా రంగులు చల్లడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలు చేయరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్- 100 లేదా 8712659360 ను సంప్రదించాలని చెప్పారు. జిల్లా ప్రజలకు ఎస్పీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.


