News July 4, 2024
నెలలో తిరిగిచ్చేస్తానంటూ చోరీ చేసిన దొంగ!

ఇంట్లో ఆరోగ్య చికిత్స కోసం తప్పట్లేదని, దోచుకున్న సొత్తును నెలరోజుల్లో తిరిగిచ్చేస్తానని ఉత్తరం రాసి మరీ ఓ దొంగ చోరీ చేయడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తిరుచ్చెందూర్‌కు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబం గత నెల చెన్నై వెళ్లింది. ఈ నెల 1న తిరిగొచ్చాక ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో దొంగ రాసిన ఉత్తరాన్ని పోలీసులు గుర్తించారు.
Similar News
News March 16, 2026
ఈ తప్పులతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి!

ఏమీ తినకున్నా కొన్నిసార్లు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. దీనికి 4 కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, ఫుడ్ స్కిప్ చేయడం, లేవగానే కాఫీ తాగడం వల్ల అసాధారణంగా షుగర్ పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి ఇది హానికరమని అంటున్నారు. ‘రోజూ 7-8గంటలు నిద్రపోవాలి. మెడిటేషన్, యోగా చేయాలి. సమయానికి తినాలి. ఖాళీ కడుపుతో కెఫీన్ పదార్థాలు తాగొద్దు’ అని సూచిస్తున్నారు.

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 11.45AMకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఈ నెల 20న బడ్జెట్‌ను భట్టి ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కొత్త హాల్‌లో శాసనమండలి కొలువుదీరనుంది. నేడు గవర్నర్, CM చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.