News July 4, 2024
గిద్దలూరు: కిరోసిన్ పోసుకొని యువతి ఆత్మహత్య

గిద్దలూరు మండలం కొంగలవీడు రహదారిలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మంగారి గుడి సమీపంలో రవణమ్మ అనే 15 సంవత్సరాల యువతి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో రవనమ్మ శరీరం పూర్తిగా కాలిపోయింది. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా.. రవణమ్మ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 8, 2026
ప్రకాశంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై సమీక్ష

ప్రకాశం జిల్లా యువతకు నైపుణ్యాలు అందించేందుకు జిల్లాస్థాయిలో అడ్వాన్సుడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. సుంచూరియా యూనివర్సిటీతో కలిసి ఏర్పాటు చేయాలని, అడ్వాన్స్డ్ కోర్సులపై శనివారం ప్రకాశం భవన్‌లో కలెక్టర్ రాజాబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికార రవితేజ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
News March 7, 2026
పెద్ద దోర్నాల వద్ద ప్రమాదం.. యువకుడు స్పాట్‌డెడ్

పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెలుగొండ ప్రాజెక్టు వైపు వెళ్తున్న వింగర్ బొమ్మలపురం చెంచు కాలనీ వైపు వెళ్తున్న ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 7, 2026
10th పరీక్షల నిర్వహణపై కలెక్టర్, SP సమీక్ష

10వ తరగతి పరీక్షల నిర్వహణలోఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్‌తో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయని DEO తెలిపారు.


