News July 4, 2024
నెల్లూరు కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు

నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఓ.ఆనంద్ గురువారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సబ్ కలెక్టర్ విద్యాధరి, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, ఇన్‌ఛార్జ్ డీఆర్‌ఓ పద్మావతి స్వాగతం పలికారు. అనంతరం ఆయన అల్లూరు సీతారామ రాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Similar News
News March 8, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. MP నివాళి

AP వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి తమకు ఆవేదన కలిగించిందని MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో MP దంపతులు నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లి అన్వర్ జాన్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
News March 7, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. మంత్రి సంతాపం

AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ X వేదికగా స్పందించారు. అన్వర్ జాన్ మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.
News March 7, 2026
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: DMHO సుజాత

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా వైద్యాధికారి సుజాత అన్నారు. శనివారం వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య అనాధాశ్రమంలో మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులకు తేడా పోటీలు నిర్వహించి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. అనాధ బాలల మధ్య ఈ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.


