News July 4, 2024
HYD: కూకట్‌పల్లిలో కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీ

నగరంలోని పలు ప్రాంతాల్లో GHMC కమిషనర్ ఆమ్రపాలి శానిటేషన్‌పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ, మూసాపేట్, భరత్ నగర్‌లోని రైతుబజార్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ వీధుల్లో పరిశుభ్రమైన వాతావరం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. GVP తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
Similar News
News September 18, 2025
చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం

సినీ కార్మికులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య బీమా కల్పించి, చిన్న బడ్జెట్ సినిమాలకు సహాయం చేస్తామన్నారు. HYDను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్దామని చెప్పారు. ‘గద్దర్ అవార్డులు’ కొనసాగిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలు స్వయంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో, వారు కృతజ్ఞతలు తెలిపారు.
News September 18, 2025
BREAKING.. HYDలో భారీ ట్రాఫిక్.. 5KMల వరకు నరకం..!

HYDలో కొద్ది గంటలుగా కురుస్తోన్న వర్షంతో నగరంలో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో అమీర్‌పేట్- బేగంపేట్, సికింద్రాబాద్, సోమాజీగూడ- బేగంపేట్, సికింద్రాబాద్‌కు వెళ్లే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో దాదాపు 5 KMల వరకు ట్రాఫిక్ స్తంభించినట్లు తెలుస్తోంది. కాగా, ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులెవరూ ఇంకా రంగంలోకి దిగకపోవడం గమనార్హం.
News September 18, 2025
జూబ్లీ అభయం: ఒకరికి CM.. మరొకరికి పీసీసీ..!

జూబ్లీహిల్స్ టికెట్ కేటాయింపులో కొత్త రాజకీయం బయటకు వస్తుందని గాంధీభవన్‌లో చర్చ నడుస్తోంది. మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ అనూహ్యంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం వెనక పీసీసీ వర్గం ఉన్నట్లు అంచనా. అంజన్‌కు టికెట్ ఇప్పించేందుకు పీసీసీ సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడి నుంచి నవీన్ కుమార్ లేదా దానం నాగేందర్‌కు మద్దతుగా ఉన్నట్లు టాక్.