News July 4, 2024
VZM: 28,490 పెంపుడు కుక్కలకు ఉచిత టీకాలు

జునోసిస్ దినోత్సవ సందర్భంగా ఈ నెల 6న జిల్లాలోని 28,490 పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు వై.వి.రమణ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న పెంపుడు కుక్కల యజమానులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సమీప పశు వైద్య కేంద్రాలను సంప్రదించాలన్నారు.
Similar News
News March 25, 2026
విజయనగరం జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం రాజాం ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.
News March 25, 2026
పెండింగ్ ఈ-చలానాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి: ఎస్పీ

జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనదారులు ఈ-చలానాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. పెండింగ్ ఈ-చలానాలను వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.