News July 4, 2024
అల్లూరి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి: పవన్
AP: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. ‘బ్రిటిష్ పాలకులపై పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి పేరు వింటేనే ఒక మహోజ్వల శక్తి, స్ఫూర్తి అందరికీ అందుతాయి. సమాజం కోసం ఆలోచించి బాధిత వర్గాలకు బాసటగా నిలవాలని ఆ యోధుడి జీవితం తెలియజేస్తుంది. గిరిజనుల కోసం పోరాడిన మన్యం వీరుడి స్ఫూర్తిని నవతరం కొనసాగించాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 16, 2025
BUDGET 2026: రైల్వేస్‌కు 20% నిధుల పెంపు!
బడ్జెట్లో రైల్వేస్‌కు 20% ఎక్కువ నిధులు కేటాయిస్తారని సమాచారం. FY25లో కేటాయించిన రూ.2.65లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్లకు పెంచుతారని తెలుస్తోంది. ప్రస్తుత CAPEXలో ఇప్పటికే 80-90% మేర ఖర్చుపెట్టేశారు. FY26లో మరిన్ని రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, రైల్వే ట్రాకుల డీకంజెషన్ వంటి పనులు చేపట్టనున్నారు. అందుకే నిధులు పెంచుతారని విశ్లేషకులు అంటున్నారు.
News January 16, 2025
సైఫ్‌కు తప్పిన ప్రాణాపాయం.. ముగిసిన సర్జరీలు
యాక్టర్ సైఫ్ అలీఖాన్ కాస్మొటిక్, న్యూరో సర్జరీలు ముగిశాయి. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని లీలావతీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. ఆపరేషన్లు ముగిశాక అతడి భార్య కరీనా కపూర్ సహా కుటుంబ సభ్యులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్‌ను దుండగుడు 6 సార్లు <<15167259>>కత్తి<<>>తో పొడిచాడు. దాంతో అతడి మెడవద్ద లోతైన గాయం అయింది.
News January 16, 2025
లోన్స్ కోసం పాస్ బుక్ అడగొద్దు: ప్రభుత్వం
TG: పంట రుణాల కోసం బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ సమర్పించాల్సిన అవసరం లేదని భూ భారతి చట్టం గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. రైతుల నుంచి బ్యాంకర్లు పాస్ పుస్తకాలను అడగొద్దని స్పష్టం చేసింది. వ్యవసాయేతర, అబాదీ భూముల కోసం ప్రత్యేక పోర్టల్‌ను తీసుకురానుంది. పంట లోన్లను రైతులు చెల్లించకపోతే ఆ రుణాల వసూలు కోసం బ్యాంకర్లు ముందుగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది.