News July 4, 2024
‘విశ్వంభర’ డబ్బింగ్ పనులు ప్రారంభం

వశిష్ఠ డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర మూవీ డబ్బింగ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ డబ్బింగ్ చెబుతుండటం, స్క్రిప్ట్ బుక్‌కు పూజలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాదాపుగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, VFX పనులు కొనసాగుతున్నాయి. కాగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది.
Similar News
News March 6, 2026
BREAKING: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.770 తగ్గి రూ.1,62,110కు చేరింది. ఐదు రోజుల్లోనే రూ.10,980 తగ్గడం విశేషం. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పతనమై రూ.1,48,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 6, 2026
న్యూజిలాండ్‌తో అంత ఈజీ కాదు!

ఆదివారం T20 WC ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ ఢీకొంటాయి. WC చరిత్రలో హెడ్ టు హెడ్ చూస్తే కివీస్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్లు తలపడ్డ 3 మ్యాచుల్లో ఆ జట్టే గెలిచింది. ప్రస్తుత టీమ్‌లో ఫిన్ అలెన్, సీఫర్ట్ భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. రచిన్, ఫిలిప్, చాప్‌మన్, మిచెల్‌తో కూడిన కివీస్ బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్భేద్యంగా ఉంది. వీరికి బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.
News March 6, 2026
సుఖోయ్ క్రాష్.. ఇద్దరు పైలట్లు మృతి

అస్సాంలో నిన్న సుఖోయ్ <<19308614>>యుద్ధ విమానం<<>> క్రాష్ అయిన విషయం తెలిసిందే. అందులో ఉన్న పైలట్లు అనుజ్, పుర్వేష్ దురగ్‌ఖర్ చనిపోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. నిన్న రాత్రి సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గాల్లోకి ఎగిరిన కాసేపటికే 7.42pmకు రాడార్ నుంచి ఫైటర్ జెట్ కాంటాక్ట్ కోల్పోయినట్లు IAF తెలిపింది.


