News July 4, 2024

HYDలో గుట్టలుగా నిర్మాణ వ్యర్థాలు..! 

image

నగర పరిసరాల నుంచి భారీ మొత్తంలో నిర్మాణ వ్యర్థాలను తీసుకొచ్చి HYD హైటెక్ సిటీలో అక్రమంగా డంప్ చేస్తున్నారని పలువురు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా అందరి కళ్ల ఎదుట జరుగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరవయ్యారని పేర్కొన్నారు. HYDలో నిర్మాణ వ్యర్థాలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయని, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని నగర ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Similar News

News April 1, 2026

రంగారెడ్డి: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

HYD: రూ.2,501 కోట్ల ఆస్తి పన్ను వసూలు

image

క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో 2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,501.25 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. భారీ బకాయిదారులకు వడ్డీపై 90 శాతం రాయితీ, ఓటీఎస్ సదుపాయాన్ని వివరించడం, ఇతరత్రా చర్యలతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే వంద కోట్లకు పైగా ఆస్తి పన్ను జీహెచ్ఎంసీ ఖజానాకు చేరినట్లు సమాచారం. కాగా, సరైన లెక్కలు నేడు స్పష్టం కానున్నాయి.