News July 4, 2024

HYD: రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్ వద్ద అదనంగా వసూలు 

image

HYD నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద క్లాక్ రూమ్‌లో వసూళ్లపై SCR ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదులు చేశారు. బెంగళూరు ప్రాంతానికి చెందిన అవినాశ్ అనే వ్యక్తి నుంచి క్లాక్ రూమ్ వద్ద ఒక బ్యాగుకి 24 గంటలకి రూ.20 వసూలు చేయాల్సి ఉండగా రూ.40 వసూలు చేశారని, ఇలా వందలాది మంది నుంచి అదనంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిల్ కండిషన్లలోనూ 24 గంటలకు రూ.20 వసూలు చేయాలని ఉందని చూపించారు.

Similar News

News January 18, 2026

మునిసిపల్ ఎన్నికలు.. అభ్యర్థులారా ఇవి తెలుసుకోండి

image

2026 మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అర్హతలు, నామినేషన్ నిబంధనలు, ఖర్చు పరిమితులు తప్పక తెలుసుకోవాలి. భారత పౌరుడై 21 ఏళ్లు నిండాలి. సంబంధిత వార్డు ఓటరై ఉండాలి. పార్టీ అభ్యర్థికి ఒక ప్రపోజర్, స్వతంత్ర అభ్యర్థికి 10 మంది ప్రపోజర్లు అవసరం. ఖర్చు పరిమితి మునిసిపాలిటీ రకాన్ని బట్టి రూ.2-రూ.10లక్షల వరకుంటుంది. ప్రతి ఖర్చు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నిక రద్దవుతుంది.

News January 18, 2026

రంగారెడ్డి: జనవరి 19 నుంచి సర్పంచులకుTRAINING

image

రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఐదు విడతల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ముచ్చింతల స్వర్ణ భారతి ట్రస్టులో జనవరి 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఈ తరగతులు జరగనున్నాయి. ఫరూక్ నగర్, కొందుర్గు తదితర మండలాల్లో ఫిబ్రవరి 17 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. పాలనాపరమైన అంశాలపై అవగాహన కల్పించే ఈ శిక్షణకు ప్రతిఒక్క సర్పంచ్ హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.

News January 18, 2026

రంగారెడ్డి జిల్లాలో మహిళలకు 62 స్థానాలు

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉన్నాయి. వీటిలో ఆమనగల్లులో 15, చేవెళ్లలో 18, ఇబ్రహీంపట్నంలో 24, మొయినాబాద్‌లో 26, షాద్‌నగర్‌లో 28, శంకర్‌పల్లిలో 15 వార్డులు ఉన్నాయి. వీటిలో ST మహిళ, SC మహిళ, BC మహిళ, అన్‌రిజర్వ్‌డ్ మహిళలకు 62 స్థానాలు దక్కాయి. ఆమనగల్లులో 7, చేవెళ్లలో 9, ఇబ్రహీంపట్నంలో 12, మొయినాబాద్‌లో 13, షాద్‌నగర్‌లో 14, శంకర్‌పల్లిలో 7వార్డులు మహిళలకు కేటాయించారు.