News July 4, 2024

అసెంబ్లీకి టీమ్ ఇండియా క్రికెటర్లు

image

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెటర్లకు మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆహ్వానం అందింది. ఆ రాష్ట్రానికి చెందిన రోహిత్‌శర్మ, సూర్య కుమార్ యాదవ్, శివం దూబే, యశస్వీ జైస్వాల్‌ అసెంబ్లీకి వెళ్లి సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసే అవకాశం ఉంది. ఇతర క్రికెటర్లను సైతం ఆయా రాష్ట్రాల సీఎంలు సత్కరిస్తారు.

Similar News

News January 28, 2025

మార్కెట్ లాభాలకు కారణం ఇదే!

image

చైనా Deepseek AI వ‌ల్ల IT స్టాక్స్, ఎయిడ్స్ మందుల సరఫరాకు ఇచ్చే నిధులను నిలిపేస్తామన్న US ప్రకటనతో ఫార్మా రంగాలు నష్టపోయినా దేశీయ స్టాక్ మార్కెట్లు Tue లాభాలతో ముగిశాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో లిక్విడిటీ పెంపు నిర్ణ‌యాల‌తో రెపో రేటును RBI త‌గ్గించ‌వ‌చ్చ‌న్న ఉహాగానాలు సెంటిమెంట్‌ను బ‌ల‌ప‌రిచాయి. దీంతో బ్యాంకు, ఫైనాన్స్ షేర్ల‌కు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో వోలటైల్ మార్కెట్‌లోనూ సూచీలు లాభపడ్డాయి.

News January 28, 2025

జూన్‌లోగా నామినేటెడ్ పదవుల భర్తీ: CBN

image

AP: పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జూన్‌లోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1,100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ సభ్యులనే సిఫారసు చేయాలని సీఎం సూచించారు.

News January 28, 2025

ఏపీ మాజీ గవర్నర్‌ హరిచందన్‌కు అస్వస్థత

image

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. 2019 నుంచి 2023 వరకు బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి గవర్నర్‌గా సేవలు అందించారు.