News July 4, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఎమ్మెల్యే

image

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో ప్రాథమికోన్నత పాఠశాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు సందర్శించారు. 5వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి పాఠాలను చెప్పారు. విద్యార్థులు చదువుల్లో రాణించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సరళ ఎమ్మెల్యేకు వివరించారు. సర్పంచ్ భాను, ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు.

Similar News

News March 15, 2026

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

image

శ్రీకాకుళం జిల్లాలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు విస్తృతంగా హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు హోటల్స్‌లో వినియోగిస్తే సీజ్ చేస్తున్నారు. దీంతోపాటు భారీగా ఫైన్ వేస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ అక్రమ వినియోగం వల్ల గ్యాస్ కొరత సమస్యగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

News March 15, 2026

శ్రీకాకుళం: కాసులు కురిపిస్తున్న మొగలిరేకులు

image

శ్రీకాకుళంలోని ఉద్దానంలోని “మొగలి” డొంకలు సహజ రక్షణ కవచంలా తీరప్రాంతాన్ని కాపాడటంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు చక్కని ఆదాయం వనరుగా మారాయి. దట్టంగా పెరుగుతూ సహజ రక్షణ గోడగా నిలుస్తూ తీరప్రాంతాన్ని తుపాన్ల నుంచి కాపాడుతున్నాయి. మొగలిరేకులు నుంచి తయారుచేసే అత్తరుకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో సీజన్లో కొన్ని కుటుంబాలు ఈ అత్తరు తయారిని కుటీర పరిశ్రమగా నిర్వహించి, మంచి ఆదాయం సంపాదిస్తున్నాయి.

News March 15, 2026

శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్ కోసం క్యూ

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పెట్రోలు కోసం బoకుల వద్ద జనం క్యూ కడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఊహాగానాలు జోరందుకోవడంతో ప్రజలు పెట్రోలు బంకులకు పరిగెడుతున్నారు. ఈ ఊహాగానలలో నిజం లేదని పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీలు తెలిపాయి. దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, రూమర్స్ నమ్మొద్దని సూచిస్తున్నా… పానిక్ బైయింగ్స్ కొనసాగుతున్నాయి