News July 4, 2024

నారాయణపేటలో రోడ్డు ప్రమాదం

image

నారాయణపేటలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. గొడుగేరి ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఇద్దరు యువకులు స్కూటీపై ప్రధాన రహదారి పైకి వస్తుండగా అదుపుతప్పి వేగంగా వెళుతున్న టిప్పర్ కిందపడి నరసింహారెడ్డి(34) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి చేతికి బలమైన గాయం తగిలింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

Similar News

News March 4, 2026

పాలమూరు:జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✔ఘనంగా హోలీ వేడుకలు
✔తుమ్మన్‌పేటతో విడదీయలేని అనుబంధం: హీరో విజయ్‌ దేవరకొండ
✔జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు:SP
✔పాలమూరు: డ్రంక్ అండ్ డ్రైవ్.. 5 మంది డ్రైవర్లకు జైలు శిక్ష
✔జడ్చర్ల: మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు
✔పాలమూరు: రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు
✔శరవేగంగా మహబూబ్‌నగర్ – దేవరకద్ర రైల్వే పనులు
✔చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత

News March 3, 2026

జడ్చర్ల మృతదేహం సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

image

రాష్ట్రవ్యాప్తంగా సంచలమైన సృష్టించిన జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న సంఘటనపై జడ్చర్లకు చెందిన న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News March 3, 2026

MBNR: జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు: SP

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వర్గాల మధ్య అపోహలు లేదా ఉద్రిక్తతలు కలిగించేలా సోషల్ మీడియా వేదికల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ షేర్ చేయడం చట్టపరంగా చర్యలకు గురయ్యే అంశాలుగా పరిగణించబడతాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, నిర్ధారించని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. SHARE IT