News July 4, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పెందుర్తి-పినగాడ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన మధు (30) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి దేవరాపల్లి మండలం అలమండ గ్రామానికి చెందిన యువతితో ఏడాదిన్నర కిందట పెళ్లిజరిగింది. వీరికి ఓ పాప ఉంది. ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 16, 2026

పద్మనాభంలో భారీగా కోడిపందాలు.. 73 మంది పట్టివేత

image

పద్మనాభ మండలం శివారు ప్రాంతం రాయల్ గార్డెన్స్‌లో అర్ధరాత్రి కోడిపందాలు నిర్వహిస్తుండగా సిటీ టాస్క్‌ఫోర్స్ పద్మనాభం పోలీసులు పట్టుకున్నారు. కోడిపందాలు నిర్వహణ ప్రాంతంలో 73 మందిని అదుపులోకి తీసుకోగా 7,56,000 నగదు, ఎనిమిది కారులు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. భారీ ఎత్తున కోడిపందాలు నిర్వహించడం స్థానికంగా సంచలమైంది.

News March 16, 2026

నేటి నుంచి ఒంటి పూట బడులు: డిఈవో

image

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 16, 2026

మూడేళ్లలో వైజాగ్ మెట్రో పూర్తి: నారాయణ

image

విశాఖలో వైజాగ్ మెట్రో రైలు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని, రైటర్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. రెండు నెలల్లో నివేదిక వస్తుందన్నారు. ఆలస్యం లేకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. భోగాపురం కనెక్టివిటీ రోడ్లకు అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు.