News July 4, 2024
రోడ్డు ప్రమాదంలో వరికుంటపాడు MEOకి గాయాలు

ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద జాతీయ రహదారిపై కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వరికుంటపాడు మండల విద్యా శాఖా ధికారి షావుద్దీన్ కి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన ఎంఈఓను వేరే వాహనంలో ఆసుపత్రి తరలించారు. విధులు నిర్వహించుకొని తిరిగి కనిగిరిలోనే తన నివాసానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.
Similar News
News March 14, 2026
నెల్లూరు: రైతన్నలూ.. వాళ్లతో జాగ్రత్త!

ఎండనక, వాననక తమ రక్తాన్ని చెమటగా మార్చి రైతన్నలు పంటలు పండిస్తారు. మార్కెట్లో పంట అమ్ముకునే సమయంలో కొంతమంది దళారుల మాయ మాటలు నమ్మి మోసపోతారు. నగదు త్వరగా చెల్లిస్తామని నమ్మబలికి పంటలను కొనుగోలు చేసే దళారులు రైతులను నట్టేట ముంచిన ఘటనలు చాలా జరిగాయి. ఇప్పటికైనా నెల్లూరు జిల్లా రైతులు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
News March 14, 2026
నెల్లూరు జిల్లాలో పెరిగిన నూనె ధరలు

యుద్ధ ప్రభావం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వంట నూనె ధరలు కలవరపెడుతున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు కిలోకు రూ.10 నుంచి 15 రూపాయల మేర పెరిగాయి. నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 లక్షల లీటర్లకు పైగా వంట నూనెల వినియోగం జరుగుతోంది. దేశంలో వంట నూనెలు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News March 14, 2026
నెల్లూరు: కిరోసిన్ అయినా ఇవ్వండి సార్..!

నెల్లూరు జిల్లాలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్ సర్వర్ పనిచేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ లేక ఇళ్లలో అవస్థలు పడుతున్నామని.. సమస్య పరిష్కారమయ్యే వరకు తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేయాలని ప్రజలు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.


