News July 4, 2024
తూ.గో.: బీ.టెక్‌తో ఉద్యోగాలు

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియా ఆధ్వర్యంలో డిప్లమా, బీ.టెక్ చదివిన వారికి ట్రైనీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తూ.గో. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండలరావు గురువారం తెలిపారు. 2019- 2024లో ఉత్తీర్ణత సాధించి, 18-25 సంవత్సరాలలోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. https://forms.gle/7EzcxnL6Z2CqcbpC6 వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 28, 2025
తుఫాన్ చర్యలపై రాజమండ్రి MP ఆరా

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. తుపాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
News October 28, 2025
తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
News October 28, 2025
తూ.గో జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం కూడా సెలవు ఇచ్చామని డీఈవో కె.వాసుదేవరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా స్టడీ క్లాసులు, అదనపు తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


