News July 4, 2024
VZM: 11 నెలలుగా కోమాలో.. నేడు మృతి

కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న ఎం. సత్యనారాయణ గురువారం మృతి చెందినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. గతేడాది ఆగస్టు 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమయ్యింది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన నేడు మృతి చెందినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు మౌనం పాటించి నివాళులర్పించారు.
Similar News
News January 6, 2026
VZM: జిల్లాలో రైస్ మిల్లర్లపై మంత్రి నాదేండ్ల ఆగ్రహం

జిల్లాలోని రైస్ మిల్లర్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన బొండపల్లిలోని లక్ష్మీనారాయణ మోడరన్ రైస్ మిల్లును మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లర్ల అసోసియేషన్ నాయకులతో సమావేశమయ్యారు. ధాన్యాన్ని మర పట్టి ప్రభుత్వానికి అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. CMR విషయంలో ఎందుకు వెనుకబడ్డారని నిలదీశారు.
News January 6, 2026
VZM: డీలర్ల సమస్యలపై మంత్రి నాదెండ్లకు వినతి

రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం విజయనగరం జిల్లాను పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కాపు రామారావు డీలర్ల సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. క్వింటాకు రూ.300 కమిషన్ ఇవ్వాలి, నిత్యావసర వస్తువుల అమ్మకాలకు అనుమతి, 60 సంవత్సరాలు దాటిన డీలర్లకు పెన్షన్, రుణ మాఫీ వంటి ప్రధాన అంశాలను వివరించారు. మంత్రి వినతిని స్వీకరించి సానుకూలంగా స్పందించారు.
News January 6, 2026
VZM: ‘GOOD NEWS… కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ’

జిల్లాలో SC కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు వడ్డీ మాఫీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. NSFDC పథకం ద్వారా రుణాలు పొందిన 297 మందికి రూ.96.60 లక్షలు, NSKFDC పథకం ద్వారా రుణాలు పొందిన 173 మందికి రూ.47.18 లక్షల వడ్డీ మాఫీ వర్తిస్తుందన్నారు. ఈ సౌకర్యం పొందాలంటే లబ్ధిదారులు 4నెలల్లోపు రుణాల అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలన్నారు.


