News July 4, 2024
TGలో పదేళ్లకోసారి అధికారం మారుతుంది: రేవంత్

తెలంగాణలో పదేళ్లకోసారి, ఏపీలో ఐదేళ్లకోసారి అధికారం మారే ట్రెండ్ ఉందని TG సీఎం రేవంత్ అన్నారు. 2029 వరకు TGలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు. పోలింగ్ రోజు రిజర్వులో ఉండే 15% యంత్రాలను ట్యాంపరింగ్ చేసి అటు ఇటు మారిస్తే ఎవరికీ తెలిసే అవకాశం లేదు’ అని ఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించారు.
Similar News
News January 6, 2026
మక్తల్: ఫిజిక్స్ టీచర్ లేక విద్యార్థులు చదువుకు తీవ్ర అంతరాయం

మక్తల్ మండలంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో రెండేళ్లుగా PGT ఫిజిక్స్ ఉపాధ్యాయులు లేకపోవడం కారణంగా 10వ తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. బోర్డు పరీక్షలు సమీపిస్తుండగా కీలకమైన ఫిజిక్స్ సబ్జెక్టు బోధన అందకపోవడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదంటున్నారు.
News January 6, 2026
కంది పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కంది పంటలో 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతే కోయాలి. పంట కోతకు 3-4 రోజుల ముందు లీటర్ నీటికి ఇమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రా. కలిపి పిచికారీ చేస్తే పంట నిల్వ సమయంలో పెంకు పురుగు ఆశించకుండా కాపాడవచ్చు. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్త, ఎండిన ఆకులు, మట్టి మొదలగునవి లేకుండా చేసి 3-4 రోజుల వరకు ఎండబెట్టాలి. గింజలలో 9-10 శాతం తేమ ఉండేటట్లుగా చూసుకోని నిల్వ చేయాలి.
News January 6, 2026
త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

TG: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో షెడ్యూల్ వెలువడొచ్చని CM, PCC చీఫ్ పార్టీ ముఖ్య నేతలను అలర్ట్ చేస్తున్నారు. షెడ్యూల్ లోపే పెండింగ్ పనులు పూర్తిచేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో పెండింగ్ పనులను గుర్తించి పూర్తిచేసేలా నిధులు విడుదల చేయించాలని CM మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.


