News July 4, 2024
ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేకే?

TG: కె.కేశవరావును ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆయనకు ఉన్న రాజకీయ, పరిపాలనాపరమైన అనుభవాలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిన్న బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కేకే, ఇవాళ రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తనకు సొంతిల్లు వంటిదని చెప్పారు.
Similar News
News March 25, 2026
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో నేటి నుంచి 3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. ఇవాళ మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, అన్నమయ్య, చిత్తూరు, TRPT జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది.
News March 25, 2026
ఆముదం సాగుకు అనువైన రకాలు

☛ DCH-177: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ DCH-519: 90-180 రోజులు. దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ PCH-111: 90-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ PCH-222: 90-170 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ GCH-08: 95-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ ICH-66: 90-180 రోజులు. దిగుబడి: 7-9 క్వింటాళ్లు
☛ ICH-5: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 7-9 క్వింటాళ్లు
News March 25, 2026
‘రండి చూసుకుందాం’.. USకు ఇరాన్ సవాల్!

ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో వేలాది సైనికులను పశ్చిమాసియాకు పంపాలని అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. 20 ఏళ్లుగా తాము దీని కోసమే ట్రైన్ అవుతున్నామని సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రతినిధి అడ్మిరల్ అహ్మదియాన్ పేర్కొన్నారు. ‘ఇంకా దగ్గరకు రండి’ అంటూ సవాల్ విసిరారు. దీన్ని బట్టి ఇరాన్ సైన్యం నేరుగా తలపడేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.


