News July 4, 2024
రిటైర్మెంట్‌పై బుమ్రా కీలక వ్యాఖ్యలు
తన కెరీర్ ఇప్పుడే మొదలైందని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించనని టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపారు. తాను ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సంగతి తెలిసిందే. 8 మ్యాచులాడి తక్కువ ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో బుమ్రా తొలివరుసలో ఉన్నారు.
Similar News
News January 16, 2025
ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు
US అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20న వాషింగ్టన్ డీసీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని వీధుల్లో 48KM మేర 7 అడుగుల ఫెన్సింగ్‌ను నిర్మిస్తున్నారు. 25వేల మంది పోలీసులతోపాటు 7,800 మంది సైనికులను మోహరించనున్నారు. వైట్ హౌస్ చుట్టూ 2KM పరిధిలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.
News January 16, 2025
GOOD NEWS: BC నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్
TGలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో వచ్చే నెల 15 నుంచి వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. RRB, SSC, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్లకు 100 రోజులపాటు శిక్షణ ఇస్తామని తెలిపింది. గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9 వరకు <
News January 16, 2025
ముంబై సేఫ్ కాదన్న సెలబ్రిటీలు.. ఖండించిన సీఎం
సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి ఘటనతో ముంబై మరోసారి ఉలిక్కిపడింది. సల్మాన్ ఇంటి ముందు కాల్పులు, రాజకీయ నేత సిద్దిఖీ హత్య వంటి వరుస ఘటనలు జరుగుతుండటంతో ముంబై సేఫ్ కాదంటూ పలువురు సెలబ్రిటీలు SMలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాదనలను CM ఫడణవీస్ కొట్టిపారేశారు. ఒకటి, రెండు సంఘటనలను చూపుతూ ముంబై ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.