News July 4, 2024

వికసిత AP నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: అమిత్ షా

image

వికసిత భారత్‌, వికసిత AP నిర్మాణానికి NDA ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. CM చంద్రబాబు, TDP MPలతో సమావేశమై దేశం, రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించినట్లు తెలిపారు. దీనికి CBN బదులిస్తూ ‘వికసిత భారత్, వికసిత AP లక్ష్యంగా పని చేసేందుకు మేము సర్వ సన్నద్ధంగా ఉన్నాం. ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు మీ సహకారం అవసరం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 16, 2025

వరుసగా నాలుగు రూ.100 కోట్ల సినిమాలు

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా ఆయన నటించిన నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఖండ’, గోపీచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’, అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’, బాబీ ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టాయి. ఈ నాలుగింట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి.

News January 16, 2025

ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు

image

US అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20న వాషింగ్టన్ డీసీ‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని వీధుల్లో 48KM మేర 7 అడుగుల ఫెన్సింగ్‌ను నిర్మిస్తున్నారు. 25వేల మంది పోలీసులతోపాటు 7,800 మంది సైనికులను మోహరించనున్నారు. వైట్ హౌస్ చుట్టూ 2KM పరిధిలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.

News January 16, 2025

GOOD NEWS: BC నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

image

TGలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో వచ్చే నెల 15 నుంచి వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. RRB, SSC, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్లకు 100 రోజులపాటు శిక్షణ ఇస్తామని తెలిపింది. గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9 వరకు <>దరఖాస్తు<<>> చేసుకోవాలని సూచించింది. ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.