News July 5, 2024
దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ పవన్‌కళ్యాణ్ పూజలు

ఉపముఖ్యమంత్రి, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం వారాహి ఏకాదశ దినదీక్షలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిత్యయంత్రం ఎదుట ఆశీనులై వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ సూర్యారాధన చేశారు.
Similar News
News January 7, 2026
సంక్రాంతికి నిడదవోలు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు: DM

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ధనుంజయ్ తెలిపారు. ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు నిడదవోలు – విజయవాడ మార్గంలో నాలుగు ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రధాన ప్రాంతాలకు సర్వీసులను ఏర్పాటు చేస్తామని, ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 7, 2026
దూబచర్లలో విషాదం.. బైకును ఢీకొట్టి పరార్

నల్లజర్ల మండలం దూబచర్లలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకుపై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బైకిస్టు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
News January 7, 2026
జగన్‌తో తానేటి వనిత భేటీ.. చోడవరం ఫ్లెక్సీ వివాదంపై సుదీర్ఘ చర్చ!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తానేటి వనిత మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా చోడవరం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఫ్లెక్సీల వివాదం, అనంతరం తలెత్తిన పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.


