News July 5, 2024
బడి బయట పిల్లలను గుర్తించండి: ఆర్జేడీ

ఇప్పటికీ బడికి వెళ్లకుండా బడి బయట ఉన్న పిల్లలను వెంటనే గుర్తించాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ రాఘవరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలుకు వచ్చిన ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గతేడాది కంటే పెంచాలని సూచించారు. విద్యా కానుక కిట్ల పంపిణీ 100% పూర్తి చేయాలన్నారు.
Similar News
News November 4, 2025
జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులనున ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పీజీఆర్ఎస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, తాగునీరు, శానిటేషన్, వ్యవసాయం తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.
News November 3, 2025
13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ తెలిపారు. అక్టోబర్ 25న లీప్ యాప్‌లో అటెండెన్స్ మార్కు చేయని కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 3, 2025
గ్రామాల్లో నీటి సమస్య ఉండకూడదు: కలెక్టర్

గ్రామాల్లో ఎక్కడా నీటి సమస్యలు ఉండకూడదని కలెక్టర్ డా.ఏ.సీరి ఆర్ డబ్ల్యుూఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఆమె పలు అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ శాఖ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.


