News July 5, 2024

ఏపీలో హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రితో చర్చించిన సీఎం

image

AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. అనంతపురం-అమరావతి, హైదరాబాద్ -అమరావతి హైవేల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావులతో పాటు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Similar News

News March 11, 2026

ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే?

image

ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు బిడ్డకు కవచంలా ఉంటూ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం ఎక్కువవుతుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది అవుతుంది. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉమ్మనీరు ఎంత ఉందో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 11, 2026

టీమ్ ఇండియాపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

image

T20WCలో భారత్ తమకు అనుకూలంగా పిచ్‌లను తయారుచేసుకుందనే ఆరోపణలను పాక్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీమ్ ఖండించారు. ‘ఇండియా ఫ్రెండ్లీ పిచ్‌లు తయారుచేసుకుందని లేదా అంపైర్లు వారికి అనుకూలంగా వ్యవహరించారని చాలా మంది అంటుంటారు. కానీ ఈ టోర్నమెంటులో పిచ్‌లు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు ఇండియాకు ప్రతికూలంగా ఉన్నా మంచి ఆటతీరు కనబరిచారు. వాళ్లు మనకంటే చాలా బాగా ఆడారు’ అని ప్రశంసించారు.

News March 11, 2026

NLC ఇండియా లిమిటెడ్‌లో 16 పోస్టులు

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్‌ 16 హెల్త్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులకు ఇంటర్/డిప్లోమా(శానిటరీ ఇన్‌స్పెక్టర్‌)/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిప్లోమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొంది. వయసు 30 ఏళ్లు దాటకూడదు. వేతనం రూ.38 వేలు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు 02-04-2026 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.nlcindia.in చూడండి.