News July 5, 2024

పాక్‌లో రూ.370కి చేరిన లీటరు పాల ధర!

image

పాకిస్థాన్ ప్రజలపై అక్కడి GOVT మరో భారం మోపింది. ప్యాకేజ్డ్ పాలపై 18% పన్ను విధించడంతో ధరలు 25% పెరిగాయి. అల్ట్రా హై టెంపరేచర్ పాల ధర రూ.370కి చేరింది. ఇది అభివృద్ధి చెందిన AUS, ఫ్రాన్స్ దేశాల్లోని ధరల కంటే అధికం. ఈ నిర్ణయంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, పేదరికంలో ఉన్న చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పాక్‌లో నిత్యవసరాలు, ఇంధన ధరలు భారీగా పెరిగాయి.

Similar News

News March 18, 2026

ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఎప్పుడంటే?

image

AP: 2026-27 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 1న కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఆ రోజు నుంచి 23వ తేదీ వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1న ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 10 నుంచి 20 వరకు దసరా, 2027 JAN 9-17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.

News March 18, 2026

గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

image

AP: గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్‌ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్‌లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.

News March 18, 2026

ఈ గ్రామంలో ఉన్నట్టుండి నిద్రపోతారు!

image

కజకిస్థాన్‌లోని కలాచి అనే గ్రామంలో ప్రజలు ఎప్పుడు, ఎలా నిద్రపోతారో ఎవరికీ తెలియదు. నడుస్తున్నా, మాట్లాడుతున్నా సరే ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఎవరూ లేపకపోతే రోజుల తరబడి పడుకుండిపోతారు. అందుకే దీనిని ‘స్లీపీ హలో’ అని పిలుస్తారు. సమీపంలోని పాత యురేనియం గనుల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో