News July 5, 2024
మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత

ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించిందీ తెలియరాలేదు. జాబ్‌లు కోల్పోయిన వారు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఈ తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా జనవరిలో గేమింగ్ డివిజన్‌లో మైక్రోసాఫ్ట్ 2వేల మందిని తొలగించింది. గతేడాదిలో సంస్థ ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27లక్షలకు తగ్గింది.
Similar News
News March 10, 2026
జగిత్యాల: మద్యం మత్తులో ప్రాణం తీస్తే.. ఎనిమిదేళ్ల జైలు

మల్లాపూర్ రోడ్డు ప్రమాద కేసులో జగిత్యాల ప్రధాన సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో బైక్ నడిపి గుండంపల్లికి చెందిన శివరాత్రి సాగర్ మృతికి కారణమైన వేంపేట్‌కి చెందిన మారంపెల్లి నవీన్‌కు కోర్టు 8 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.10 వెల జరిమానా విధించింది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బైక్ ఇచ్చినందుకు వాహన యజమాని మారంపెల్లి అంజయ్యకు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
News March 10, 2026
గాయపడ్డ మొజ్తబా ఖమేనీ?

ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. ఆ దేశ TV ఛానల్ ఒకటి ఆయనను ‘జాన్‌బాజ్ ఆఫ్ రంజాన్’(గాయపడ్డ యుద్ధ వీరుడు) అని సంబోధించడమే ఈ వార్తలకు కారణమని India Today తెలిపింది. మొజ్తబా ఎన్నికను ట్రంప్ ఇప్పటికే వ్యతిరేకించారు. దీంతో US-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్‌కు గాయాలయ్యాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దాడుల్లో ఇప్పటికే అలీ ఖమేనీ, కుటుంబం మృతి చెందింది.
News March 10, 2026
గ్యాస్‌తో పని లేకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి

గల్ఫ్ యుద్ధంతో సిలిండర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ ఆదా చేసుకోవడం బెటర్. వీలైనంత వరకు స్టవ్‌తో పనిలేని ఫుడ్ సిద్ధం చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ, పూరి, వడ లాంటివి పక్కన పెట్టి సలాడ్స్, శాండ్‌విచ్, స్ప్రౌట్స్, మిక్స్‌డ్ ఫ్రూట్స్, బ్రెడ్-జామ్, బాయిల్డ్ ఎగ్స్(ఎగ్ బాయిలర్‌లో ఉడికించినవి), జ్యూస్‌లు తీసుకోవాలి. ఇవి మీ సిలిండర్‌ను ఆదా చేయడమే కాకుండా ఆరోగ్యానికీ మంచివి.
Share it


