News July 5, 2024
గుంటూరు: ఆన్లైన్ మోసం.. రూ.10లక్షలు స్వాహా

ఆన్లైన్ మోసంపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరిటెపా డుకు చెందిన హేమంత్ కుమార్ టెలిగ్రామ్ యాప్లో ఓ టాస్క్ ఆపరేట్ చేశాడు. అందులో టాస్క్ పెట్టి పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని చెబుతారు. టాస్క్ నిర్వాహకులు చెప్పిన విధంగా పలుమార్లుగా రూ.10లక్షలు చెల్లించాడు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 4, 2025
అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేసి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.
News November 4, 2025
GNT: మోటార్ వాహనాలకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు

దివ్యాంగులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు మంజూరుకు ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డీ.డీ దుర్గాబాయి తెలిపారు. వంద శాతం సబ్సీడీతో ఈ వాహనాలు అందించడం జరుగుతుందని చెప్పారు. www.apdascac.ap.gov.inలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మ నిర్భరత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని తెలిపారు.
News November 4, 2025
అమరావతికి రూ.32,500 కోట్ల అదనపు రుణాలు

అమరావతి రాజధాని నగరం అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు అందనున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి ₹14,000 కోట్లు రుణం అందే అవకాశం ఉంది. దీనితో పాటు, నాబ్‌ఫిడ్ నుంచి ₹10,000 కోట్లు, నాబార్డు నుంచి ₹7,000 కోట్లు రానున్నాయి. ఈ కొత్త నిధులతో కలిపి, సీఆర్డీఏకు ₹58,500 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. CRDA ఇప్పటికే ₹91,639 కోట్ల విలువైన 112 నిర్మాణ పనులను చేస్తోంది.


